వెనుకబడిన వర్గాల పాఠశాల విద్యార్థులకు వెయ్యి రూపాయల ఉపకార వేతనం ఇస్తామని చెప్పిన సీఎం... ఫీజులను సైతం మేమే కడతామని ప్రకటించారు. యువతకు ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. నగరి, పుత్తూరు, తిరుపతి కలిసి మెగాసిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి కల్పిస్తానని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
గాలేరు-నగరి పూర్తి చేసి నీళ్లిస్తా: సీఎం చంద్రబాబు - చంద్రబాబు
పోలవరం పనులపై మోదీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడిన చంద్రబాబు.. నగరి ప్రజలు గోదావరి నది నీళ్లు తాగబోతున్నారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా జలాశయాలు, చెరువులకు నీళ్లిచ్చే బాధ్యత నాదేనని భరోసా ఇచ్చారు.
సీఎం చంద్రబాబు