ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'మార్పు అంటూ అంధకారంలోకి వెళ్లొద్దు' - TELE

భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలి. అధికారం మారిన తర్వాత రాష్ట్రంలో పదేళ్లు జరిగిన అరాచకాలు అందరికీ తెలిసిందే. ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దు. - ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Mar 15, 2019, 10:02 AM IST

అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.సుదీర్ఘ కసరత్తు చేసి గెలిచే వ్యక్తులనుఎంపిక చేశామన్నారు.కార్యకర్తలు,ప్రజల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని సీఎం స్పష్టం చేశారు.రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక చేశామని పేర్కొన్నారు.టిక్కెట్ రాని వారెవ్వరూ నిరాశ చెందవద్దని...రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం కలిపించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రకటించిన అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కార్యకర్తలకుసూచించారు. జరిగేవి ప్రజాఎన్నికలని..వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు.కుల,మత,ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమం చేశామని తెలిపారు.ఎక్కడ,ఎవరూ చేయలేని అభివృద్ధి కళ్లారా చూస్తున్నామని వివరించారు.37ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో22ఏళ్లు తామే అధికారంలో ఉన్నామని టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు.అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్నారు.ఓటు మార్పు అంటూమళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకువిజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details