'మోదీ.. మాయ మాటలొద్దు' - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిత్యం జిల్లాల వారీగా సమావేశమవుతున్నారు. ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ చేస్తున్నారు. 6 నెలలపాటు వరుస ఎన్నికలు ఉంటాయని.. నేతలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిత్యం జిల్లాల వారీగా సమావేశమవుతున్నారు.ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ చేస్తున్నారు. 6నెలలపాటు వరుస ఎన్నికలు ఉంటాయని..నేతలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.రాయలసీమకు నీటి సరఫరా కారణంగా తెదేపాపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని తెలిపారు.ప్రత్యేక హోదాపై మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పష్టత ఇచ్చారని అన్నారు.రేపు ప్రధాని మోదీ వచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదని వ్యాఖ్యానించారు.రాష్ట్ర హక్కులు నెరవేర్చాకే ఏపీలో కాలు మోపాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో తెదేపా వచ్చాకే తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందని...మళ్లీ తెదేపా రావడం చారిత్రక అవసరం ఉందని అన్నారు.ఒక్క ఓటు వైకాపాకు పడినా అది కేసీఆర్,మోదీకి వేసినట్లేనని పేర్కొన్నారు. 3పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుతున్న అంశాలే దీనికి సాక్ష్యాలన్నారు.రాష్ట్ర భవిష్యత్ కోసం విభేదాలు వీడి చిరకాల ప్రత్యర్థులు తెదేపాలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.ఆదినారాయణరెడ్డి -రామసుబ్బారెడ్డి,కోట్ల -కేఈ కుటుంబాలే ఇందుకు ఉదాహరణగా చెప్పారు.ఈ నెల 28న దిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం ఉందన్నారు.సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చంద్రబాబు నేతలకు చెప్పారు.