వైకాపా నేతల దురాగతాలతో తరతరాల అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...తెదేపాపైఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోర్టు కొట్టేసిన పాత కేసుతిరగదోడి వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు.ఐటీ దాడులతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైకాపా ఎన్ని అరాచకాలకు బరితెగిస్తున్నా ప్రజలు తమకు అండగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
'వైకాపా దురాగతాలతో తరతరాల అభివృద్ధికి గండి' - CHANDRABABU ON YCP
వైకాపా నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెదేపాపై ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎన్ని అరాచకాలకు బరితెగిస్తున్నా ప్రజలు తమకు అండగా ఉన్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
తెదేపా నేతల మనో నిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలకు దీటుగా బదులిద్దామని నేతలకుసీఎంసూచించారు. దుష్ట చతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దారి మూసేస్తా.. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు దిగారని సీఎం మండిపడ్డారు.
మైలవరంలో వైకాపా నేతలు రణరంగం సృష్టించారని సీఎం తెలిపారు.పోలీసులు,జవాన్లపై చెప్పులు,రాళ్లతో వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నారు.పొన్నూరులో విద్యార్థుల ఆటోపై వైకాపా నేతల దౌర్జన్యాలు చేశారని అన్నారు.అద్దెకుండే వాళ్లపై దౌర్జన్యాలు,అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారన్నారు.గర్భిణీని జుట్టుపట్టుకుని ఈడ్చటం లాంటి పనులు చేస్తున్నారన్నారు.వృద్ధులు అనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయటవేస్తున్నారని...వైకాపాకు ఓటేస్తే సొంత ఇంటిలోనే అద్దెకు ఉండాల్సిందేనని సీఎం తెలిపారు.