కడప జిల్లా బద్వేలు ప్రచార సభలో సీఎం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ లాంటి నాయకులుఇష్టానుసారంగా మాట్లాడారని కడప జిల్లా బద్వేలు తెదేపా ప్రచార సభలో అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ''ఆస్తులు ఉన్నాయి జాగ్రత్త'' అని బెదిరించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
కొన్నాళ్లకుఅమరావతి...హైదరాబాద్‌ను మించిపోతుందని కేసీఆర్ బాధ అనిసీఎం అన్నారు. అందుకే కేసీఆర్ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పారు.జగన్‌తో కలిసి ఏపీలో పెత్తనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య ఘటనలో అనేక నాటకాలు ఆడారని ఆరోపించారు. డిటెక్టివ్ నవలలోనూ ఇన్ని ట్విస్ట్‌లు ఉండవని ఎద్దేవా చేశారు. దేశంలో 31 కేసులు ఉన్న ఏకైక నాయకుడు.. జగన్ అని అన్నారు. వైఎస్ వివేకా మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న కుటుంబం జగన్‌ది అని ఆగ్రహించారు. చిన్న కోడికత్తి కేసుకు ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయిస్తున్నారుని మండిపడ్డారు. బద్వేల్ నియోజకవర్గాన్ని కుప్పంతో పాటు అభివృద్ధి చేసే భాద్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు.