ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారు: సీఎం

తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు చేస్తున్నారని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో దీక్షకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి సీఎం విజ్ఞాపన పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు.

babu

By

Published : Apr 5, 2019, 1:31 PM IST

కేంద్రం వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో దీక్ష

విభజన చట్ట హామీలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీ శాశ్వతంగా ఉంటారంటూ జగన్‌ పొగుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారం జగన్‌ హైదరాబాద్‌ నుంచి కుట్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఐటీ దాడులు చేస్తున్నారని... తెలుగుజాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారని హెచ్చరించారు. తమిళనాడులో ఐటీ దాడులు.. వికటించిన విషయం గుర్తు చేశారు. మాయావతి, అఖిలేష్‌పై దాడులు చేస్తే గోరఖ్‌పూర్‌లో పరాజయం పాలయ్యారని అన్నారు. తమపై ఒత్తిళ్లు తెచ్చి అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తున్నందుకే తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని.. చరిత్ర హీనులుగా నిలబెడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారిని ప్రజల ముందు ద్రోహులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details