ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాజకీయ నేతల్లారా... మా సమస్యలు తీరుస్తారా! - బాలల హక్కులు

రాష్ట్రంలో ఎన్నికల వేళ హోరెత్తిన రాజకీయ మైకులు.. నెలన్నరగా మూగబోయాయి. ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న ఈ సమయంలో ఎవరి అంచనాలు వారికున్నాయి. గెలుస్తామన్న ధీమాతో ఉన్న పార్టీల నేతలను తమ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేస్తారో చెప్పండంటూ చిన్నారులు గళం విప్పారు.

బాలల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీల కర్తవ్యం

By

Published : May 21, 2019, 7:04 PM IST

బాలల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీల కర్తవ్యం

'బాలల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీల కర్తవ్యం' అన్న అంశంపై.. విశాఖ పౌరగ్రంథాలయంలో బాలవికాస్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓటు హక్కు లేకపోయినా.. భావితరంలో తమ బాధ్యత ఉందంటూ గుర్తుచేసిన బాలలు.. రాజకీయ నేతలకు సమస్యలను వినిపించారు.

తాము చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని సమస్యలపై గళం విప్పారు. మరుగుదొడ్ల లేమి, తాగునీటి సదుపాయం, మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం, అపరిశుభ్ర పరిసరాలు వంటి సమస్యలను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చారు.

బాలలు లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్, కమ్యూనిస్టు, జనసేన, వైకాపా నేతలు స్పందించారు. పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి :'కుటుంబ పరిస్థితులే నా విజయానికి కారణం'

ABOUT THE AUTHOR

...view details