తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం వారికి చేరువ కావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.