ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం: చంద్రబాబు - ట్వీట్స్

ఈ తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలమనీ... ఇక్కడి ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తన శక్తినీ, ఉత్సాహాన్ని పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

చంద్రబాబునాయుడు

By

Published : Apr 20, 2019, 12:58 PM IST

Updated : Apr 20, 2019, 3:03 PM IST

ఆంధ్రప్రదేశ్​ను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా చూడాలన్న తన లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన.. ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, మేధావులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

అంతిమంగా ధర్మానిదే విజయం
ధర్మపోరాట దీక్ష ప్రారంభించి నేటికి సంవత్సరం అయిందనీ.. 40 సంవత్సరాల ప్రజాజీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని స్పష్టంచేశారు. కొంత ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ధర్మానిదే విజయమని తన అనుభవంలో నేర్చుకున్నానని తెలిపారు. మన రాష్ట్రానికీ, మన ప్రజలకూ న్యాయం జరిగి మళ్లీ ధర్మమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలమనీ... ఇక్కడి ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తన శక్తినీ, ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు.

Last Updated : Apr 20, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details