'తమిళనాడు తెలుగువాళ్లు.. డీఎంకేకే ఓటేయండి' - డీఎంకే అగ్రనేత స్టాలిన్
తమిళనాడులోని తెలుగువాళ్లంతా.. డీఎంకేకే ఓటు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
చెన్నై పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... తన మద్దతును డీఎంకే పార్టీకి ప్రకటించారు. కేంద్రంలో డీఎంకే అగ్రనేత స్టాలిన్ కీలకం కానున్నారని చెప్పారు. తమిళనాడులోని తెలుగువాళ్లంతా.. డీఎంకేకే ఓటు వేయాలని కోరారు. తమిళనాడు అభివృద్ధి కోసం డీఎంకే రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ అన్యాయం చేశారని మరోసారి గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. విభజన హామీలు ఏమాత్రం తీర్చలేదని ఆరోపించారు. అలాంటి పరిస్థితి రాకుండా.. తమిళులు డీఎంకేను గెలిపించాలని కోరారు. డీఎంకే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేస్తూ.. తెలుగు వాళ్లంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.