కడప జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకోవాలంటే... జిల్లా ప్రజలు తెదేపాకు మద్దతుగా నిలబడాలని కోరారు. ప్రతిరోజు సాయంత్రం లోటస్‌పాండ్‌కు వెళ్లే వ్యక్తి జగన్ అని... జగన్‌కు ప్రజల కష్టాలు, నష్టాలు ఏమీ పట్టవని అన్నారు. దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిన వ్యక్తి మీకు కావాలా?...అని ప్రజలను ప్రశ్నించారు.
మోదీకి జగన్ దాసోహం అయ్యాడు: చంద్రబాబు
కడప జిల్లా ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబు... మోదీ,జగన్, కేసీఆర్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీపై విషం కక్కుతున్న కేసీఆర్‌తో జగన్ కలిశారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహమయ్యారని అన్నారు.
ముద్దనూరు ఆర్టీపీపీని మూసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నిజాలంటే జగన్కుభయమని ఎద్దేవా చేశారు. బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్ తెస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ, పింఛను సాధ్యం కాదని వైకాపా చెప్పిందన్నారు. ఆడబిడ్డల సౌభాగ్యం కోసమే పసుపు-కుంకుమ ఇచ్చానని చెప్పారు.
వైకాపా నేతలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.అగ్రిగోల్డ్ బాధితులు మాయమాటలను నమ్మవద్దని సీఎం సూచించారు. అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలంవేసి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త రాష్ట్రంలో కరెంటు కొరత లేకుండా చేసిన ఘనత తెదేపాదేనన్నారు.