వైకాపా ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేసే తప్పుడు పనులు ప్రజల్లో ఎండగడతామని అమరావతి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు నాయకులను పిలిచి పులివెందుల పంచాయితి చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి రెండు గంటల్లో బెయిల్ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.
'సీఎం జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారు' - latest news of chandra babu in amaravathi
అమరావతి తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారని ఆరోపించారు.
తెదేపా అధినేత చంద్రబాబు
Last Updated : Oct 9, 2019, 8:29 PM IST