సత్యం, ధర్మం, నీతి, న్యాయం చంద్రబాబు వెంటే ఉన్నాయన్న బ్రాహ్మణ ప్రతినిధులు... తెలుగుదేశం గెలుపు-బ్రాహ్మణుల గెలుపు అన్నారు. అన్నదాత-సుఖీభవ అర్చకులకు వర్తింపచేయాలని సీఎంను కోరారు. ఐదేళ్లు అభివృద్ధి ఫలాలు చంద్రబాబు మనందరికీ అందించారని పేర్కొన్న బ్రాహ్మణులు... ఇప్పుడు ప్రతిఫలాలను అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల ఆశీర్వాదాలు ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉన్నాయని, దైవ కృప చంద్రబాబుకే ఉండేలా బ్రాహ్మణులంతా ఆశీస్సులు అందించాలని పిలుపునిచ్చారు.
అర్చక కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మిస్తా: చంద్రబాబు - చంద్రబాబు
బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేసే బాధ్యత తనదేనని, అర్చక కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు... చంద్రబాబుకు ఆశీస్సులు అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమానికి చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు.
ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్దంలో బ్రాహ్మణులంతా చంద్రబాబు వైపు ఉండాలన్నారు. చంద్రబాబుకు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సత్కారం చేసి చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు. అర్చకులు, బ్రాహ్మణోత్తములతో భేటి అయిన చంద్రబాబు.. అర్చక కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేరాలు-ఘోరాలు చేసేవాళ్లంతా రాజకీయాల్లోకి రాకుండా నిరోధించాలన్న బాబు... శాసన మండలి సభ్యత్వం బ్రాహ్మణులకే ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి :13 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. 18న కల్యాణం