దిల్లీలో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు...పలువురు జాతీయ నేతలతో భేటీ అయ్యారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమైన చంద్రబాబు... తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఏచూరితో సమాలోచనలు చేశారు.
ఎన్డీయేతర పార్టీల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఈ భేటీలో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో సమావేశమయ్యారు. బంగాల్ పరిస్థితులు, ఎన్నికల సంఘం వైఖరితో సహా పలు అంశాలపై చర్చించారు.
ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ - kejriwal
ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందురు సీఎం చంద్రబాబు...ఎన్టీయేతర పక్ష నేతలతో భేటీ అవుతున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఇవాళ సీతారాం ఏచూరి, కేజ్రీవాల్ సమావేశమై తాజా పరిణామాలపై మాట్లాడారు. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మయావతితో సమావేశమవనున్నారు.
![ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3309580-651-3309580-1558109474144.jpg)
ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ
ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ
రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు లఖ్నవూ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మాయావతితో చంద్రబాబు సమావేశమవనున్నారు.
Last Updated : May 17, 2019, 11:18 PM IST