ఎంపీగా నంద్యాల, కర్నూలు అభివృద్ధికి ఎస్పీవై రెడ్డి చేసిన సేవలను మరవలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎస్పీవై రెడ్డి మరణంపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా చేసిన సేవలు అభినందనీయమని కీర్తించారు. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి.. నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయన మృతి నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
ఎస్పీవై రెడ్డి మృతిపై సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం
ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. నాయకుడిగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
Chandrababu
పవన్‌కల్యాణ్ విచారం
ఎస్పీవై రెడ్డి మరణం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారని గుర్తు చేసుకున్న పవన్.. రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడు ఎస్పీవై రెడ్డి అని కొనియాడారు. కరవు ప్రాంతాల్లో ప్రజలకు ఎస్పీవై రెడ్డి చేయూత ఎన్నదగిందన్నారు.
Last Updated : May 1, 2019, 12:09 AM IST