ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం - జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం

ప్రతిపక్ష నేత జగన్​ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ..గుంటూరులో డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో చండీయాగం చేపట్టారు. ఏప్రిల్​ 11 వరకు ఈ యాగం కొనసాగనుంది.

గుంటూరులో చండీయాగం

By

Published : Apr 2, 2019, 9:07 AM IST

గుంటూరులో చండీయాగం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గుంటూరు జిల్లా కంటెపూడిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో చండీయాగం చేపట్టారు.డ్వాక్రా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆరమండి విజయ శారదా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటుఈ యాగం జరుగనుంది. దేశంలో పేరు గాంచిన ముగ్గురు వేద పండితులతోపాటు 54 మంది పురోహితులు ఈ మహారుద్ర సహిత చండీ రాజ శ్యామల ప్రత్యంగిరా మహోత్సవం చేస్తున్నట్లు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు యాగం చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details