విజయవాడ సింగ్ నగర్లోని చెత్త డంపింగ్ యార్డులో ఇటీవల భారీగా చెత్త నిల్వలు పెరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నాయకులతో కలిసి డంపింగ్ యార్డును పరిశీలించారు. యార్డు నిర్వహణ తీరు సరిగాలేదని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
"డంపింగ్" నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం - dumping yard
విజయవాడ సింగ్ నగర్ డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు భారీ పెరిగిపోయాయని స్థానికులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి డంపింగ్ యార్డును పరిశీలించారు. అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
జనావాసాల మధ్య ఉన్న ఈ భారీ డంపింగ్ యార్డుకు ప్రతినిత్యం 550 టన్నుల తడి, పొడి చెత్తను తరలిస్తారు. ఈ చెత్తని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు గ్రామంలోని డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. కానీ పాతపాడు గ్రామస్థులు చెత్త తరలింపు వద్దని ఆందోళన చేస్తున్నారు. దీంతో చెత్తను సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు నగరానికి చెందిన నిల్వలు ఉండిపోతున్నాయి. ఈ అంశంపై అధికారులు స్పందించకపోవడం వల్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చెత్త సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్!