ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సరోగసీతో సెలబ్రిటీలకు సంతానం

సరోగసీ...గర్భం దాల్చలేని మహిళలకు అద్దె గర్భంలో పిండం ప్రవేశపెట్టి ప్రసవింపచేసే ప్రక్రియ... స్త్రీలు గర్భం దాల్చే అవకాశం లేనప్పుడు ఈ ప్రక్రియ ద్వారా సంతానాన్ని పొందవచ్చు. 2016లో ఈ విధానంపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం... గత డిసెంబరులో కొన్ని మార్పులతో ఆమోదించింది. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ విధానంలో సంతానం పొందిన సినీప్రముఖులను ఇప్పుడు చూద్దాం!

సరోగసీతో సెలబ్రిటీలకు సంతానం

By

Published : Mar 8, 2019, 11:54 AM IST

Updated : Mar 8, 2019, 4:45 PM IST

మంచు లక్ష్మి
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సరోగసీ ద్వారా కూతురుకు జన్మనిచ్చారు. 2014 జూన్ 15 ఫాదర్స్ డే రోజున మంచు లక్ష్మి దంపతులు తల్లిదండ్రులయ్యారు. 2006 వివాహం చేసుకున్న ఈ జంటకు సరోగసీతో గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డను పొందారు.

ఆమిర్ ఖాన్
డిసెంబర్ 2011లో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్, కిరణ్​రావ్ దంపతులు సరోగసీ ద్వారా అమ్మానాన్న అయ్యారు. ఇద్దరు పిల్లలున్నప్పటికీ ఆమిర్‌ తన మూడో సంతానానికి ఈ విధానం వినియోగించుకున్నారు.

షారుఖ్​ఖాన్
మే 2013లో షారుఖ్, గౌరీ ఖాన్​కు సరోగసీ ద్వారా అబ్​రామ్​కు జన్మించాడు. ఇంతకు ముందు ఇద్దరు పిల్లలను కలిగిఉన్న ఈ దంపతులు మూడో సంతానం కోసం ఈ విధానం ఎంచుకున్నారు. షారుఖ్ నిర్ణయం తర్వాతే సరోగసీకి విస్తృత ప్రాచుర్యం వచ్చింది.

కరణ్​జోహార్
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరన్ జోహర్ వివాహం లేకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. గత ఏడాది మార్చి 4న సరోగసీతో వచ్చిన యాష్, రూహీ కవలలతో తనకో బాధ్యత వచ్చిందంటూ సంతోషపడుతున్నారు.

సన్నీలియోనీ
బాలీవుడ్ నటి సన్నీలియోనీ పేరు అందరికి సుపరిచితమే. సన్ని, డేనియల్ దంపతులు 2018 ఫిబ్రవరిలో సరోగసి ద్వారా అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్‌ కవలలకు అమ్మ అయ్యారు. ఆమె గతంలోనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

తుషార్ కపూర్
బాలీవుడ్ నటుడు తుషార్ 2016 జూన్​లో తనకు బాబు పుట్టాడని అందర్నీ ఆశ్యర్యపరిచారు. ఈ గోల్​మాల్ హీరో వివాహం చేసుకోకుండానే సరోగసీ ద్వారా తండ్రి అయ్యారు. ఈ విధానం భారత్​లో అంగీకరిస్తారో... లేదోనని మొదట్లో ఆయన తల్లిదండ్రులు కంగారు పడ్డారన్నారు. తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్నారు.

శ్రేయాస్ తాల్పాడే
ఇక్బాల్, ఓం శాంతి ఓం లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రేయాస్‌. ఈ విధానంలో గతేడాది మే4న ఓ పాపకు తండ్రి అయ్యారు. సరోగసి ద్వారా సంతానం కలిగినందుకు శ్రేయాస్, భార్య దీప్తి ఇద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల దాంపత్యంలో ఓ చిన్ని పాప తమ జీవితంలోకి వచ్చినందుకు గర్వంగా ఉందని చాలాసార్లు అభిప్రాయపడ్డారు.

సరోగసీతో సెలబ్రిటీలకు సంతానం
Last Updated : Mar 8, 2019, 4:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details