సీనియర్ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమనీ.. తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
రాళ్లపల్లి మృతిపట్ల ప్రముఖుల సంతాపం - చిరంజీవి
ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. రాళ్లపల్లి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![రాళ్లపల్లి మృతిపట్ల ప్రముఖుల సంతాపం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3312676-145-3312676-1558116590845.jpg)
"ఆయనకు, నాకూ మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. మొన్న 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. ఇంతలోనే తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. రాళ్లపల్లి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా." --- చిరంజీవి.
"ప్రముఖ సీనియర్ నటులు రాళ్ళపల్లిగారి మరణం చాలా విచారకరం. సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." ---- లోకేశ్