ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సుజనాచౌదరి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు - బెంగళూరు

ఎంపీ సుజనాచౌదరికి చెందిన కార్యాలయాలలో రెండో రోజూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12చోట్ల సోదాలు చేపట్టారు.

సుజనాచౌదరి కార్యాలయంలో కొనసాగుతున్న సీబీఐ సోదాలు

By

Published : Jun 2, 2019, 12:06 PM IST

హైదరాబాద్‌లోని సుజనాచౌదరి కార్యాలయంలో రెండో రోజూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని సుజనాగ్రూప్‌ కార్యాలయంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సోదాలు చేస్తున్నారు.

నిన్నటి నుంచి బెంగళూరుకి చెందిన సీబీఐ అధికారులు సుజనాచౌదరి ఇంట్లో, కార్యాలయంలో తనిఖీలు చేపడుతున్నారు. దేశంలో మొత్తం 12చోట్ల సోదాలు చేపట్టారు. బెంగళూరులో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీపై కేసు నమోదయ్యింది. ఇది సుజనా గ్రూపు బినామీ కంపెనీగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details