గుంటూరు జిల్లా బాపట్లలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం నుంచి నగదు చోరీ అయ్యింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కీర్తి నాగరాజు... బాపట్ల స్టేట్ బ్యాంకులో ఇవాళ 3లక్షల రూపాయలు విత్ డ్రా చేశారు. అనంతరం మరో బ్యాంకులో కూడా డబ్బు తీసుకోవడానికి వెళ్లారు. ముందు తీసుకున్న నగదును బైక్ బాక్స్‌లో ఉంచారు. వాహనాన్ని పార్క్ చేసి బ్యాంక్ లోపలకు వెళ్లిన నాగరాజు... తిరిగి వచ్చేసరికి అగంతకులు డబ్బు దొంగిలించారు. నాగరాజు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ వద్ద గల సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. ఎవరో వ్యక్తి వాహనదారుని మాదిరిగా బాధితుడి బైక్ వద్ద నిలబడి...చాకచక్యంగా బైక్ బాక్స్ తెరచి నగదు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. బాధితుడి వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బైక్ నుంచి 3 లక్షలు చోరీ... సీసీ కెమెరాలో దృశ్యాలు - cc footage
గుంటూరు జిల్లా బాపట్లలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం నుంచి నగదు చోరీ అయ్యింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బైక్ పక్క బాక్స్‌లో ఉంచిన రూ.3 లక్షల నగదును వాహనదారుడిలా నిలబడి అగంతకుడు దొంగిలించాడు.
బైక్ బాక్స్ నుంచి రూ.3 లక్షలు చోరీ...సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదు