ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ స్వాధీనం - bagepalli

అనంతపురం జిల్లా- కర్ణాటక సరిహద్దులో బాగేపల్లి టోల్ గేట్ వద్ద భారీ నగదు పట్టుబడింది. చిలమత్తూరు సమీపంలోని బాగేపల్లి జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద గల కార్యాలయంలో 1 కోటీ 75 లక్షల నగదును హిందూపురం గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ 75 లక్షల నగదు స్వాధీనం

By

Published : Apr 5, 2019, 7:31 AM IST

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ 75 లక్షల నగదు స్వాధీనం
సమాచారం తెలుసుకున్న హిందూపురం సీ.ఐ వెంకటేశులు నగదు విషయంపై కర్ణాటక ఎన్నికల అధికారులు సమాచారం అందించారు. వీరివురు కలిసి టోల్‌గేట్‌లోని మేనేజర్ కార్యాలయాన్ని తనిఖీ చేయగా... రూ.1 కోటి 75లక్షల నగదు బయటపడింది. ఈ విషయంపై టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశ్నించగా.. వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మొత్తం నగదును కర్ణాటక ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఏ పార్టీ వారైనా పంచడానికి అక్కడ ఉంచారా అనే విషయంపై విచారణ చేపడతామన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details