ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్: బి.వి.రాఘవులు - parvathipuram

గిరిజన ఆస్తులను కొల్లగొట్టే పార్టీలను ఓడించాలని సీపీఎం నేత రాఘవులు కోరారు. ఇవాళ పార్వతీపురంలో పర్యటించిన రాఘవులు... పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష - జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీపీఎం నేత బి.వి.రాఘవులు

By

Published : Apr 5, 2019, 1:39 PM IST

Updated : Apr 5, 2019, 4:11 PM IST

రాష్ట్రంలో వామపక్ష, జనసేన పార్టీలే రాజకీయ ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా తమ పార్టీలకే ఉందన్నారు. తెదేపా, వైకాపా కేంద్రప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయాయని విమర్శించారు. ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్ లు తీసుకున్నాయన్నారు.

సీపీఎం నేత బి.వి.రాఘవులు

రాష్ట్రానికి హోదా ఎవరు ఇస్తే వారికే తన మద్దతంటున్న వైకాపా..భాజపాతో లాలూచీ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న భాజపాతో లోపాయికారి ఒప్పందాలు సబబు కాదని హితవుపలికారు. ఐటీ దాడులు చేయడంపై స్పందించి రాఘవులు...అభ్యర్థులను భయందోళనకు గురిచేసేందుకే సోదాలు చేపట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి చర్యలు సరికాదన్నారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు.

గిరిజనుల హక్కులను కాలరాసిన తెదేపా, భాజపాలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గిరిజన హక్కుల సాధనకు పోరాడే వామపక్షాలనే గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి 'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'

Last Updated : Apr 5, 2019, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details