అతి వేగంతో బోల్తాపడిన బస్సులు.... 50 మందికి గాయాలు - krishna
రాష్ట్రంలో ఒకే రోజు రెండు ప్రైవేటు బస్సులు ప్రమాదంబారిన పడ్డాయి.హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వద్ద బోల్తాపడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రమణా ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద పల్టీ కొట్టింది.
![అతి వేగంతో బోల్తాపడిన బస్సులు.... 50 మందికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3200616-4-3200616-1557116760109.jpg)
రాష్ట్రంలో ఒకే రోజు రెండు ప్రైవేటు బస్సులు ప్రమాదంబారిన పడ్డాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వద్ద బోల్తాపడింది. అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపైన డివైడర్‌ను ఢీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అద్దంకి, ఒంగోలు అస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. అద్దాలు పగలగొట్టి బాధితులను స్థానికులు బయటకు తీశారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రమణా ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద పల్టీ కొట్టింది. బస్సులో 20మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో సుమారు పదిమంది చిన్నారులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు చెబుతున్నారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు చిన్నారులను విజయవాడకు తరలించారు.