ETV Bharat / briefs
జగన్ ప్రచారసభలో అపశ్రుతి.. గోడ కూలి ఇద్దరు మృతి - జగన్ ర్యాలీ
మండపేట వైకాపా సభాస్థలిలో ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు నిలబడిన భవన పిట్ట గోడ అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.


జగన్ ప్రచారసభలో కుప్పకూలిన గోడ.
By
Published : Mar 27, 2019, 7:20 PM IST
| Updated : Mar 27, 2019, 11:10 PM IST
జగన్ ప్రచారసభలో కుప్పకూలిన గోడ. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధినేత జగన్ నిర్వహించిన ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార సమయంలో జగన్నుచూసేందుకు వైకాపా కార్యకర్తలు భవనంపైకి ఎక్కారు. అందరూ ఒక్కసారే పిట్టగోడపైకి రావడం వలన అకస్మాత్తుగాకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,.. 40 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలోఈటీవీ ప్రతినిధి వెంకటరమణతో సహా పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. ఇవీ చూడండి
Last Updated : Mar 27, 2019, 11:10 PM IST