విజయసాయిరెడ్డి ట్వీట్‌పై తెదేపా నేత బుద్దా వెంకన్న స్పందించారు.ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే..చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్ సక్రమ నిర్మాణమా అంటూ మండిపడ్డారు.ఇలాంటి అక్రమాలు సక్రమం కోసమేనా ఏపీ భవనాలు తెలంగాణకిచ్చేశారని బుద్ధా ప్రశ్నించారు.కిన్లే వాటర్ బాటిల్‌లో సీఎం జగన్ రూ.40మిగిలించానంటున్నారని...రూ.8కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక ఎలా కూల్చేయమంటున్నారని అన్నారు.
ప్రజావేదిక అక్రమమైతే... లోటస్‌పాండ్ సక్రమమా?: బుద్దా
అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే అంత ఉలుకెందుకని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు చట్టం కళ్లుగప్పారని.. ఇకపై అది సాధ్యం కాదని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు తెదేపా నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్ సక్రమమా అని ప్రశ్నించారు.
budhavenkanna-on-twitter
చీనీ తోటలు తగలబెట్టే ఫ్యాక్షన్ బుద్ధి ఎక్కడికి పోతుందని బుద్ధా వెంకన్న ఘాటుగా వ్యాఖ్యానించారు.ప్రజావేదిక చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ,ప్రజావసరాలకు ఉపయోగించాలన్నారు.కట్టేవారికి తెలుస్తుంది నిర్మాణాల విలువ..విధ్వంసకులకు తెలిసేది కూల్చడమేనని ఆరోపించారు.అక్రమాస్తులతో కట్టిన లోటస్‌పాండ్ ముందు కూల్చేయాలని...అప్పుడే మీరు చెప్పే నీతి, నిజాయితీ, నిబద్ధత నిలబడుతుందని బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.