చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా రాజ్యసభ ఎంపీలు పార్టీ ఫిరాయించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఎంపీలు పార్టీ మారడంపై తీవ్రంగా విమర్శించిన ఆయన...ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు ఫోన్ చేసి బెదిరించారని బుద్ధా వెంకన్న తెలిపారు. తాను తిరిగి ఫోన్ చేసి విషయం అడిగితే మరోసారి బెదిరించారని వెల్లడించారు. ఈ నేతలు పార్టీ మారిన గంటకే ఈ తరహాలో బెదిరింపులు పాల్పడటం దారుణమన్నారు. ఈ నలుగురిని ఎక్కడికక్కడ బహిష్కరించాలన్నారు. తెదేపా నుంచి రాజ్యసభకు ఎంపికై చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వారిని లేదని విమర్శించారు.
యార్లగడ్డ బెదిరింపులకు పాల్పడ్డారు: బుద్దా వెంకన్న - yarla gadda
చంద్రబాబు.. రాష్ట్రంలో లేని సమయం పార్టీ ఫిరాయింపుకు పాల్పడి, తెదేపాను విమర్శించే నైతిక హక్కు ఎంపీలకు లేదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీలు వ్యాఖ్యలను ఖండించినందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనను బెదిరించారన్నారు.
ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు యార్లగడ్ల బెదిరింపులు : బుద్దా వెంకన్న