'కోడికత్తి రాజకీయాలు మానుకోవాలి' - విప్ బుద్దా
వివేకానంద రెడ్డి హత్యకేసులు సీబీఐకు అప్పగించాలన్న జగన్ డిమాండ్‌పై బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. భాజపా-వైకాపా లాలూచీ రాజకీయాలకు ఇదో నిదర్శనమని విమర్శించారు. వివేకా హత్యోదంతాన్ని అసలు కారణాలు తొందరలోనే బయటపడతాయని బుద్దా అన్నారు.
జగన్‌కు సీబీఐ అంటే చాలా ప్రేమ అని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శించారు. అమరావతిలో మాట్లాడిన ఆయన జగన్-మోదీల లాలూచీతోనే సీబీఐ విచారణ అడుగుతున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డి మరణాన్ని కోడికత్తి కేసులాగానే రాజకీయం చేస్తోన్నారని బుద్దా వెంకన్న అన్నారు. వివేకా హత్యకేసును కావాలనే పక్కదారి పట్టింటాలని చూస్తున్నారన్నారు. వివేకాకు ఎక్కడైనా సీటు ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ చనిపోయాక సీఎం పదవి ఎవరు కోరారో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని విప్ తెలిపారు.