ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్‌ నిర్ణయంపై ఎమ్మెల్యే చినప్పలనాయుడి ఆనందం - ap politics

నూతన శాసనసభలో ప్రొటెం స్పీకర్​గా నియమించడంపై విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే చినప్పలనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రొటెం స్పీకర్​గా ఎమ్మెల్యే చినప్పలనాయుడు

By

Published : Jun 6, 2019, 9:30 AM IST

ప్రొటెం స్పీకర్​గా నియామకంపై బొబ్బిలి ఎమ్మెల్యే ఆనందం!
విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు శంబంగి వెంకట చినప్పలనాయుడుకు ప్రొటెం స్పీకర్​గా అవకాశం దక్కనుంది. ఈ మేరకు ఆయనకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయంపై శంబంగి సానుకూలంగా స్పందించారు. నూతన శాసన సభ్యులతో ప్రమాణం చేయించే అవకాశం రావడం ఆనందంగా ఉందని చినప్పలనాయుడు తెలిపారు. కొత్త స్పీకర్​ బాధ్యతల్లోకి వచ్చాక ప్రొటెం స్పీకర్​ పదవీ కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుపై విజయం సాధించిన శంబంగి..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details