ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెదేపాపై భాజపా విమర్శనాస్త్రాలు - gvl

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా ఓడిపోతోందని చెప్పడానికి ఆ పార్టీని వీడుతున్న నేతలే నిదర్శనమని.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు విజయవాడలో విమర్శించారు.

భాజపా విమర్శనాస్త్రాలు

By

Published : Mar 13, 2019, 8:22 PM IST

ప్రతిపక్ష నేత జగన్​ను కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ తెదేపా దుష్ప్రచారం చేస్తోంది. అవన్నీ అసత్య ప్రచారాలే. ఈసారి ఎన్నికల్లో తెదేపాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గతంలో అవినీతి కేసులు దర్యాప్తు చేసిన వ్యక్తి తెదేపాలో చేరుతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఆయనకు రాజకీయ పార్టీలతో అప్పటినుంచే సంబంధాలున్నాయేమో. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు నిజాయతీ, నిబద్ధత లేవు. భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా
- జీవీఎల్ నరసింహరావు, రాజ్యసభ సభ్యుడు.

సోము వీర్రాజు, భాజపా ఎమ్మెల్సీ.

గుంటూరులోని భాజపా కార్యాలయానికి టిక్కెట్ ఆశావహుల నుంచి అధిక సంఖ్యలోదరఖాస్తులు వస్తున్నాయని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు

కన్నా లక్ష్మీ నారాయణ

ఎన్నికల్లో 175 అసెంబ్లీ ,25 లోక్​సభ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తాం. రెండు, మూడు రోజుల్లో భాజపా మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అన్ని సామాజిక వర్గాల వారికీ సీట్ల పంపకంలో సమానత్వం పాటిస్తాం.
- కన్నా లక్ష్మీ నారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షులు

ABOUT THE AUTHOR

...view details