భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ కడప భాజపా నేతలు సంబరాలు చేసుకున్నారు. కడప భాజపా కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు చెప్పుకున్నారు. మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం భారత దేశానికి గర్వకారణమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన భాజపా తిరిగి అధికారం చేపట్టడం దేశానికి శుభ పరిణామం అని తెలిపారు. దేశాభివృద్ధిని కోరుకున్న వారు...భాజపాకు ఓటు వేసి గెలిపించారన్నారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ తరువాత అంతటి మెజారిటీ పొందిన వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలందరూ మోదీ పాలన కావాలని కోరుకోవడం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
మోదీ ప్రమాణ స్వీకారం... భాజపా నేతల సంబరాలు - భాజపా సంబరాలు
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భాజపా నేతలు సంబరాలు చేసుకున్నారు. కడప భాజపా కార్యాలయంలో కేక్ కట్ చేసి...ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్మారని అన్నారు.

భాజపా నేతల సంబరాలు