ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. ఐటీ గ్రిడ్స్ కేసుపై ఆరోపణలు చేస్తూ నాలుగు వరుస ట్వీట్లు చేశారు. "మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు" అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఎందుకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా కోర్టులో తప్పుడు పిటిషన్లు పెట్టడమెందుకని ట్వీట్ లో విమర్శలు చేశారు.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు.