ప్రముఖ అసోం గాయకుడు, దివంగత భూపేన్ హజారికాకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భారతరత్నను తిరస్కరించిన హజారికా కుటుంబం - భారతరత్న పురస్కారం
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా భారతరత్న పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు గాయకుడు భూపేన్ హజారికా కుటుంబం ప్రకటించింది.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భూపెన్ హజారికాకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయనతో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్, అసోం రాష్ట్రాల ప్రజలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు.
ఇటీవలే మణిపూర్‌కు చెందిన చిత్ర నిర్మాత అరిబమ్ శ్యాం శర్మ తనకు 2006లో ఇచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.