కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్..రెండు రోజుల విశాఖ పర్యటనలో కీలక కార్యక్రమాలకు హాజరయ్యారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములను సందర్శించారు. అనంతరం నౌకదళ అధికారులు, సివిల్ ఉద్యోగులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ అమలులో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా..ఎదుర్కుకునేందుకు సిద్ధంగా ఉండాలని నావికులకు పిలుపునిచ్చారు.
'విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి' - vishka navy
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా..ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని నావికులకు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. రెండురోజుల పాటు విశాఖలోని తూర్పు నౌకాదళంలో బసచేసిన ఆయన.. వివిధ అంశాలను పరిశీలించారు.
!['విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3709162-636-3709162-1561925785075.jpg)
నావికులతో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఇవీ చదవండి..బలపడనున్న అల్పపీడనం.. 24 గంటల్లో వర్షాలు!