హిందుపూర్లో బాలయ్య - ap politics
నేడు హిందూపూర్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. బుధవారం నుంచి ఆయన హిందుపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజూ పర్యటిస్తున్నారు. బుధవారం హిందూపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నేడు హిందూపూర్ పట్టణంలో కూరగాయల మార్కెట్- వాణిజ్య సముదాయాల భవనాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు వెచ్చించామని వివరించారు. 2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభించారు. సూరప్ప కట్ట వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ప్రజల అభ్యున్నతికి తెదేపా కట్టుబడి ఉందన్నారు. మళ్లీ సీఎంగా చంద్రబాబును గెలిపించాలని విన్నవించారు.