ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లే! - ముత్తుకూరు

గోదావరి - పెన్నా నదులను అనుసంధానం చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు.. నెల్లూరు జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేసి.. నెల్లూరు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 2, 2019, 8:18 PM IST

సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తెదేపా ప్రచారానికి అధినేత చంద్రబాబు హాజరయ్యారు.ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు చారిత్రక అవసరమని ఓటర్లకు చెప్పారు.ఐదేళ్ల పాలనలో మీరంతా ఆనందంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేసిన బాబు.. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పోలవరం పనులు ఆపలేదని గుర్తుచేశారు. జులై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీరిస్తామని హామీ ఇచ్చారు.

కృష్ణా - గోదావరి నదులను అనుసంధానం చేశామన్న సీఎం.. త్వరలోనే గోదావరి - పెన్నా నదులను అనుసంధానం చేసి తీరుతామన్నారు. కోడికత్తి పార్టీకి ఆర్థిక వ్యవస్థ అంటే తెలుసా అని ప్రశ్నించారు. వైకాపాకు దొంగలెక్కలు రాయడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కంటే ఎక్కువ పింఛను ఇస్తున్నామని చెప్పినచంద్రబాబు.. రుణమాఫీ చేసి రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.

పులివెందులలో వేరే రాజ్యాంగం అమలవుతోందని సీఎం ఆరోపించారు.వైకాపాకు ఓటేస్తే ఊళ్లపై పడి దోచుకుంటారన్నారు.ఏడాదిన్నరలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామని... అన్నిరకాల సదుపాయాలతో మరో 20 లక్షల ఇళ్లు కడతామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండిగెలిపిస్తే.. భీమవరానికి విమానాశ్రయం తీసుకొస్తా: నాగబాబు

ABOUT THE AUTHOR

...view details