ప్రజావేదిక కోసం జగన్‌కు చంద్రబాబు లేఖ - babu letter to cm jagan
సీఎం జగన్ కు తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాను ఉంటున్న నివాసంలోనే కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌కు.... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరుతూ లేఖ రాశారు. ప్రస్తుత ఇంటిని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకుంటున్నాని తెలిపారు. ఇప్పుడు తాను ఉంటున్న నివాసంలోనే కొనసాగాలనుకుంటున్నట్లు పేర్కొన్న చంద్రబాబు ....పక్కనే ప్రజావేదిక ఉన్నందున తన అధికారిక కార్యకలాపాలకు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, సందర్శకులు తనను కలిసేందుకు ఈ ప్రాంగణాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని లేఖలో కోరారు.
TAGGED:
babu letter to cm jagan