ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి: చంద్రబాబు

కుటుంబానికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎన్నికల సభకు హాజరైన సీఎం....ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు.

సీఎం చంద్రబాబు

By

Published : Apr 5, 2019, 5:27 PM IST

కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాలు తెదేపాకు కంచుకోటగా పేర్కొన్న సీఎం...సైకిల్‌కు ఓటేసేందుకు మహిళలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇకనుంచి ప్రతి ఏడాదీ పసుపు-కుంకుమ ఇస్తానన్న బాబు..పింఛన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ ఆపాలని వైకాపా నేతలు కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని తెలిపిన సీఎం...డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని స్పష్టం చేశారు. సాగర్‌, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డిన బాబు..జగన్‌, కేసీఆర్, మోదీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు

ఏమరపాటుగా ఉంటే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించిన చంద్రబాబు...మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు. లింగాయత్‌లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆలూరులో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం...ఆలూరులో గుంటూరు తరహా మిర్చియార్డు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి : పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా -వైకాపా గొడవ.. లాఠీచార్జీ

ABOUT THE AUTHOR

...view details