లండన్‌కు జగన్.. సీబీఐ అనుమతి - landon
లండన్ వెళ్లేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్‌కు సీబీఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తన కూతురిని చూసేందుకు అనుమతించాలంటూ జగన్ చేసిన అభ్యర్థనకు అంగీకరించింది.
లండన్ వెళ్లేందుకు జగన్ కు సీబీఐ అనుమతి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తన కూతురిని చూసేందుకు లండన్ వెళ్తానని.. 10 రోజుల పాటు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ అభ్యర్థనను కోర్టు మన్నించింది. లండన్ వెళ్లేందుకు అనుమతించింది.