గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన జి.బాషా అనే వ్యక్తిపై అద్దంకి-నార్కెట్పల్లి హైవే తుమ్మల చెరువు చెట్ల వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులుహుటాహుటినగురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాచేపల్లిలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావును కలిసి.. తన స్వగ్రామం పిన్నెల్లి వెళ్తుండగా దాడి జరిగింది. పరిస్థితి విషమంగా ఉన్న బాషాను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెదేపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - machavaram
దాచేపల్లిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును కలిసి తన స్వగ్రామం పిన్నెల్లి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు.
![తెదేపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3644227-643-3644227-1561326891874.jpg)
తెదేపా కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి