ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విత్తనాల పంపిణీలో జాప్యం.. అన్నదాతలు గందరగోళం - ఖరీఫ్ విత్తనాల పంపిణీ

ఖరీఫ్​లో పండించే పిల్లిపెసరల విత్తనాల కోసం ఆత్మకూరు రైతులకు గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. తగినంత స్టాక్ లేకపోవడం, బయోమెట్రిక్ విధానం వలన విత్తనాలు పంపిణీ జాప్యం జరుగుతోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మండలం మొత్తానికి ఒకేచోట విత్తనాలు అందించడం వలనే గందరగోళం ఏర్పడిందని రైతులు వెల్లడిస్తున్నారు.

విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు

By

Published : Jun 28, 2019, 6:59 AM IST

విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు
రైతుల డిమాండ్ మేరకు విత్తనాలు అందించడంలో అధికారులు విఫలయ్యారని రైతులు ఆందోళన చేశారు. పిల్లిపెసర విత్తనాల కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయశాఖ కేంద్రం వద్ద రైతులు గంటలకొద్దీ నిరీక్షించారు. ప్రతి ఏడాది పంచాయతీ వారీగా విత్తనాలు అందించేవారని...ఆ విధంగా ఎక్కువ మందికి విత్తనాలు అందేవని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది మండలం మొత్తానికి ఒకే రోజు విత్తనాలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారని..అందువలన గందరగోళం ఏర్పడిందని రైతులు తెలిపారు.

రైతులకు విత్తనాలను అందించేందుకు బయోమెట్రిక్ విధానం అమలుతో కొంత జాప్యం జరుగుతుందని ఆత్మకూరు వ్యవసాయ అధికారి ప్రసాద్ తెలిపారు. రైతులందరికీ సరిపడా విత్తనాలు అందిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details