12 నుంచి శాసనసభ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ - assembly notification
అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల 5 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.
assembly
కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో.. మొదటి సారి సమావేశాలకు రాష్ట్రశాసనసభ సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నెల12న ఉదయం11గంటల5నిమిషాలకు సమావేశం ప్రారంభమవుతుంది. 13న కొత్తసభ్యుల ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభ స్పీకర్ను ఎన్నుకుంటారు.14న ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు.అనంతరం గవర్నర్ నరసింహన్.. శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.అదే రోజున శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
TAGGED:
assembly notification