గిరిజన కళాగ్రామం పక్కనే 25 కాటేజీలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఐటీడీఏ అధికారులు... గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు కాటేజీలను సొసైటీ పేరుతో అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు. యువతకు ఉపాధితోపాటు పర్యాటకులకు కొత్త అనుభూతి పంచుతున్నారు.
ఆంధ్రా ఊటీ... మరింత ఆకర్షణీయంగా - అరకు
ఆంధ్రా ఊటీ... అరకులోయ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ చర్యలు ప్రారంభించింది. పర్యాటకుల మన్ననలను పొందేందుకు వీలుగా... ప్రభుత్వ సహకారంతో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అరకులోయ సమీపంలోని గంజాయిగూడ వద్ద ఎకోటూరిజం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. గిరిపుత్రుల జీవన విధానం కళ్లకుకట్టే రీతిలో గిరిజన గ్రామం ఏర్పాటు చేస్తోంది.
ఆంధ్రా ఊటీ... మరింత ఆకర్షణీయంగా
అరకు లోయ సమీపంలోని పద్మాపురం గార్డెన్‌ను రూ.2 కోట్లతో అభివృద్ధి చేశారు. అతిథి గృహాల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. రూ.60 లక్షలతో ఆధునీకీకరణ పనులు చేశారు. ఈతకొలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతి వృత్తులకు చేయీతనిచ్చే విధంగా... పర్యాటక శాఖ సహకారంతో వన్ కళాకృతుల మార్కెట్ ఏర్పాటు చేశారు. కొత్తవలస వ్యవసాయ ప్రదర్శనక్షేత్రంలో కళాకృతుల విక్రయించుకునేందుకు వీలు కల్పించారు.
ఇవీ చూడండి :'ఐ లవ్ యూ వైజాగ్' అంటూ కదిలిన యువత