ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు తాత్కాలికంగా నిలిపివేత - cargo services

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. బుకింగ్, డెలివరీ సేవలు తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు తాత్కాలికంగా నిలిపివేత

By

Published : Jun 28, 2019, 6:39 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

కార్గో సేవలకు తాత్కాలిక బ్రేక్
ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు నిలిపివేయనున్నారు. బుకింగ్, డెలివరీ తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. కార్గో సర్వీస్ స్టాక్ వెరిఫికేషన్ నిమిత్తం ఈ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 29న రాత్రి 8 నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పార్సిల్ బుకింగ్ నిలిచిపోనున్నాయి. 30న మధ్యాహ్నం 12 నుంచి జూలై1 ఉదయం 9 గంటల వరకు పార్సిల్ డెలివరీ చేయరు. వినియోగదారులు గమనించి, సహకరించాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details