ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు.. - నోటిఫికేషన్
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 550 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసింది.
![ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2431876-909-6219d6af-83c5-4526-8cc1-e6e6565d5f25.jpg)
ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 550 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీశాఖతో పాటు గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం , ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వంటి శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
ఉద్యోగ వివరాలు | ఖాళీలు | దరఖాస్తు గడువు |
అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ | 50 | ఫిబ్రవరి 26 - మార్చి 20 |
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు | 330 | మార్చి 5 - 27 |
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు | 100 | మార్చి 5 - 27 |
హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు | 28 | ఫిబ్రవరి 27 - మార్చి 20 |
డిప్యూటీ సర్వేయర్లు | 29 | ఫిబ్రవరి 20 - మార్చి 13 |
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ | 18 | ఫిబ్రవరి 19 - మార్చి 13 |