కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఎంతైనా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన తులసి రెడ్డి దేశంలో ప్రజాస్వామ్యానికి...నియంతృత్వానికి మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతుందన్నారు. గాంధీ అడుగుజాడలలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటే.. గాడ్సే సిద్ధాంతానికి భాజపా ప్రతినిధిగా ఉందని తులసి రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంపై నియంతృత్వం సాధించిన విజయం తాత్కలికమైనదన్నారు. అంతిమ విజయం ప్రజాస్వామ్య విలువలు పాటించే కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
గాడ్సే సిద్ధాంతాలకు.. భాజపా ప్రతినిధి: తులసిరెడ్డి - ఏపీసీసీ
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన రాహుల్ నాయకత్వం పార్టీకి ఎంతో అవసరమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. రాహుల్...రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. గాడ్సే సిద్ధాంతాలకు ప్రతినిధిగా పని చేస్తోన్న భాజపాను ఎదుర్కొనేందుకు రాహుల్ వంటి నాయకులు కావాలన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత తులసి రెడ్డి
ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగడం చారిత్రక అవసరమన్నారు.
ఇవీ చూడండి :కడపలో చెరసాల... ప్రకృతి మది మురిసేలా!