ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓట్ల గల్లంతు నిరాధారం...రాష్ట్రంలో భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య : ఈసీ - ఓటర్ల జాబితా

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగుస్తుండడం వలన రాష్ట్రంలోని అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ఓటర్ల సంఖ్య 3కోట్ల 51లక్షల 95వేల 260మంది ఉంటే...2019నాటికి ఈ సంఖ్య 3కోట్ల 91లక్షల 81వేల 399కు చేరింది.

ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది

By

Published : Mar 24, 2019, 6:09 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్యను జనవరి 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఏపీలో జనవరి 11 తర్వాత కొత్తగా 22లక్షల 48వేల 308మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఐదేళ్లలో కొత్తగా 39లక్షల 86వేల 139మంది ఓటర్లు పెరిగారని ఈసీ తెలిపింది.

ఓట్ల గల్లంతు ప్రచారాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ధరించింది. జనవరి 11నాటికి రాష్ట్రంలో 3,69,33,091 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3,91,81,399కు చేరింది. మొత్తం ఓటర్లలో ఒక కోటి 93లక్షల 82వేల 068 మంది పురుషులు, ఒక కోటి 97లక్షల 95వేల 423 మంది మహిళలు, 3వేల 908 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు.

ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల 86 వేల 139 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని ఈసీ తెలిపింది. ఫారం-7 దుర్వినియోగమైందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. కేవలం లక్షా 41వేల 822 ఓట్లను మాత్రమే తొలిగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఓటువేసే వారి సంఖ్య 39 లక్షల 86 వేలు 139కు పెరిగిందని ఈసీ తెలిపింది.

ఓటర్ల సంఖ్య

2014 2019
రాష్ట్రం 3,51,95,260 3,91,81,399
పురుషులు 1,74,58,240 1,93,82,068
మహిళలు 1,77,33,676 1,97,95,423
ట్రాన్స్​జెండర్ 3,344 3,908

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య (లక్షల్లో)

జిల్లా

2014

2019
శ్రీకాకుళం 19,95,140 21,70,802
విజయనగరం 16,78,497 18,17,635(అత్యల్పం)
విశాఖపట్నం 31,59,342 35,74,246
తూర్పుగోదావరి 38,40,538 42,04,035(అత్యధికం)
పశ్చిమగోదావరి 30,57,922 32,06,496
కృష్ణా 30,51,122 35,07,460
గుంటూరు 35,96,455 39,62,143
ప్రకాశం 24,08,706 26,28,449
నెల్లూరు 21,13,436 23,82,114
కడప 18,95,916 21,92,158
చిత్తూరు 28,94,589 31,79,101
అనంతపురం 29,24,040 32,14,438
కర్నూలు 27,57,094 31,42,322

ఇవీ కూడా చూడండి

ప్రచారంలో మార్మోగుతున్న సమర నాదం

ABOUT THE AUTHOR

...view details