ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్‌మోహన్‌రెడ్డితో సీఎస్ సుబ్రమణ్యం భేటీ - AP_VJA_28_23

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిశారు. జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.ఎన్నికల ఫలితాలు సహా భవిష్యత్ కార్యక్రమాలపై అధికారికంగా జరిగే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

cs-jagan

By

Published : May 23, 2019, 4:59 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం కావటంతో జగన్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి.. ఆయన​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్నందున ప్రోటోకాల్ ప్రకారం జగన్ ను కలసి అభినందనలు తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. కొద్దిసేపు జరిగిన భేటీ లో ఎన్నికల ఫలితాలు సహా భవిష్యత్ కార్యక్రమాలపై అధికారికంగా జరిగే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని జగన్ నిర్ణయించినట్లు వైకాపా ప్రకటించింది.ప్రభుత్వ పరంగా కార్యక్రమ నిర్వహణ పైనా ముందస్తు చర్చించినట్లు తెలిసింది. . పలువురు పార్టీ నేతలు సహా ఐఎ ఎస్ లు , ఐపీఎస్ లు, అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని జగన్ నివాసానికి వచ్చి జగన్ ను కలిసి అభినందనలు తెలుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

For All Latest Updates

TAGGED:

AP_VJA_28_23

ABOUT THE AUTHOR

...view details