ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి : ద్వివేది - గోపాలకృష్ణ ద్వివేది

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ల భద్రతపై వచ్చే అనుమానాలు కేవలం అసత్యప్రచారాలని గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు

ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి : ద్వివేది

By

Published : Apr 24, 2019, 7:07 PM IST

ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై అనుమానాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పారు.వాటిన భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని..., ఆ ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమ సందేహ నివృత్తి కోసం తమ ఏజెంట్లను స్ట్రాంగ్‌ రూమ్‌ కంట్రోల్‌ రూమ్‌లలో 24 గంటలు ఉంచవచ్చని ద్వివేది చెప్పారు.

స్ట్రాంగ్‌ రూంల భద్రతలో పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండవని..., వైఫై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్‌రూమ్‌లపై వచ్చినవి అసత్యప్రచారాలన్నారు. పుకార్లను ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details