కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.375 లేదా నెలకు రూ.9,750గా ఉండాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు డాక్టర్ స్నూప్ సత్పతి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. రంగం, నైపుణ్యం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అతీతంగా ఈ వేతనం ఇవ్వాలని సూచించింది.
పట్టణాల్లో పని చేసే కార్మికులకు అదనంగా రోజుకు రూ.55 లేదా నెలకు రూ.1,430 ఇంటి అద్దె భత్యం ఇవ్వాలని ప్రతిపాదించింది సత్పతి కమిటీ.
ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అనుసరించి వేతన నిర్ణయం కోసం రాష్ట్రాలను 5 భాగాలుగా విభజించింది సత్పతి కమిటీ. ఆయా ప్రాంతాల కార్మికులకు కనీస వేతనం రోజుకు కనిష్ఠంగా రూ.342, గరిష్ఠంగా రూ.447గా నిర్ణయించారు.